: సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాక్


సరిహద్దుల్లో పాకిస్థాన్ రెచ్చిపోతోంది. రిపబ్లిక్ డే సమీపిస్తుండడంతో పాక్ సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతోంది. గత రెండు రోజులుగా పాక్ కాల్పుల తీవ్రతను పెంచింది. సరిహద్దుల ఆవల ఆత్మాహుతి దళాలు సిద్ధంగా ఉండడంతో సైన్యం, బీఎస్ఎఫ్ దృష్టి మళ్లించి వారి చొరబాటుకు వెసులు బాటు కల్పించేలా జమ్మూ కాశ్మీర్ లోని సాంబ, హీరానగర్ సెక్టార్ వద్ద కాల్పులకు తెగబడుతోంది. సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. నిన్న సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరపడంతో జమ్మూ కాశ్మీర్ లో సరిహద్దుల వెంబడి ఉన్న పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News