: వరల్డ్ కప్ వరకు మన కోచ్ ఫ్లెచరే!


వరల్డ్ కప్ కు భారత క్రికెట్ జట్టు కోచ్ గా డంకన్ ఫ్లెచర్ కొనసాగనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్లెచర్ ఆసీస్-కివీస్ లో జరిగే ప్రపంచ కప్ కు కూడా కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఫ్లెచర్ కోచింగ్ లో టీమిండియా విదేశాల్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తోందని, ఈ నేపథ్యంలో అతనిని మార్చాలని డిమాండ్లు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో వరల్డ్ కప్ కు అతని స్థానంలో మరో నిపుణుడ్ని టీమిండియా కోచ్ గా నియమిస్తారనే పుకార్లు షికారు చేశాయి. ఆయన పదవీ కాలం పొడిగించడంతో బీసీసీఐ ఆయనపై పెట్టుకున్న ఆశలు భారీగానే ఉన్నాయనే విషయం అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News