: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్


ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నారు. ఈమేరకు అమితాబ్ అంగీకరించారని ఏపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను ఎన్నుకోవడంతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఉండనున్నారనే విషయంలో పలు ఊహాగానాలు రేగాయి. వైద్య ఆరోగ్య శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ ఉచితంగా సేవలు అందించేందుకు అంగీకరించడంతో ఏపీ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అమితాబ్ గుజరాత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా గతంలో వ్యవహరించారు. అమితాబ్ కు ప్రపంచ వ్యాప్తంగా అశేషమైన అభిమానగణం ఉంది. ఆయన బ్రాండ్ ఇమేజ్ కి అంతులేని ఆదరణ ఉంది. ఆయన సేవలతో ఏపీ వైద్య రంగం మరింత చైతన్యం సంతరించుకుంటుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News