: కుదేలైన స్టాక్ మార్కెట్లు... చరిత్రలో ఎనిమిదవ అతిపెద్ద పతనం
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. అక్టోబరు 24, 2008 తర్వాత ఇంత పెద్దఎత్తున మార్కెట్లు కుప్పకూలడం ఇదే తొలిసారి. మొత్తం సెన్సెక్స్ చరిత్రలో ఇది ఎనిమిదవ అతిపెద్ద పతనం. నేటి సెషన్లో సెన్సెక్స్ 854.86 పాయింట్లు నష్టపోయి 26,987.46 వద్ద, నిఫ్టీ 251.05 పాయింట్లు కోల్పోయి 8,127.35 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ లో ఒక్క హెచ్‌యూఎల్ మాత్రమే లాభాల్లో కొనసాగింది. ముడిచమురు ధరలు ఐదున్నరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతుందేమోనన్న అనుమానాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దిగజార్చాయని నిపుణులు వ్యాఖ్యానించారు.