: అమెరికా నిఘా శాటిలైట్ల కళ్ళన్నీ భారత్ పైనే!
మరో 20 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ కు రానున్న నేపథ్యంలో యూఎస్ సీక్రెట్ సర్వీస్ గట్టి నిఘా పెట్టింది. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన సీక్రెట్ సర్వీస్ అధికారులు భారత పోలీసులతో కలసి ఒబామా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అమెరికా ఆధ్వర్యంలోని శాటిలైట్లను భారత్ వైపు తిప్పి నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. ఈనెల 26న జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఆయన భద్రత కోసం యూఎస్ మెరైన్స్ టీంతోపాటు రూఫ్ టీం (తుపాకులతో బిల్డింగ్ పైభాగాల్లో ఉంటారు), డాగ్ స్క్వాడ్ కూడా అమెరికా నుంచి రానున్నాయి. అమెరికా అధ్యక్షుడికి మొదటి అంచె భద్రతగా ఆ దేశ అధికారులే వ్యవహరించనున్నారు. రెండవ అంచెలో ఎన్ఎస్జీ కమాండోలు, మూడవ అంచెలో ఢిల్లీ పోలీసులు ఉంటారు.