: సునంద పుష్కర్ ది హత్యేనని పోలీసుల నిర్ధారణ


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ ది హత్యేనని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఆమెపై విష ప్రయోగం జరిగినట్టు వైద్య పరీక్షల్లో స్పష్టం కావడంతో ఈ ఘటనలో హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ధ్రువీకరించారు. డిసెంబర్ 29న ఎయిమ్స్ ఇచ్చిన వైద్య నివేదికల ఆధారంగా పుష్కర్ మృతిని హత్య కేసుగా నమోదు చేశామని మీడియాకు తెలిపారు. ఆమె మరణం అసహజమని, విష ప్రభావంతో చనిపోయినట్టు తేలిందని వివరించారు. గతేడాది జనవరి 17న ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించారు.

  • Loading...

More Telugu News