: మరో ఆర్థిక మాంద్యంలోకి జారుతున్న ప్రపంచం!


ప్రపంచ దేశాలు మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుతున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు పాతాళానికి పడిపోవడం, గణనీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితరాలు మరో ఆర్థిక మాంద్యం ఏర్పడనుందన్న సంకేతాలను పంపుతున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఐదేళ్ళ తరువాత 50 డాలర్ల దిగువకు వచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురై తమ తమ వాటాలను విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా ప్రపంచ మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో సాగుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ 9 తరువాత అమెరికా మార్కెట్ అత్యధిక పతనాన్ని నమోదు చేయగా, జపాన్, కొరియా, చైనా, భారత మార్కెట్లన్నీ దాదాపు అదే దారిలో నడుస్తున్నాయి. యూరోజోన్ లో అతి తక్కువ వృద్ది రేటు నమోదవుతుండటం, జోన్ నుంచి గ్రీస్ తప్పుకోనుందని వస్తున్న వార్తలు మొత్తం యూరప్ దేశాలపై ప్రభావం చూపాయి. డాలర్ తో పోలిస్తే యూరో మారకపు విలువ ఐదేళ్ళ కనిష్ఠానికి పడిపోయింది. మరోవైపు అమెరికాలో సైతం పెట్టుబడిదారులు తమ డబ్బును మార్కెట్లలో ఉంచేందుకు వెనుకంజ వేస్తున్నారు. చమురు రంగంలో సేవలందిస్తున్న కంపెనీల షేర్ల విలువ గణనీయంగా పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తొందర్లోనే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News