: కొత్త ఐడియాలు కావాలంటున్న మోదీ


కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ సర్కారు కసరత్తులు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో దీనిపై అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దీంతో, బడ్జెట్ ను వినూత్నంగా రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. మంత్రివర్గ సహచరులకు ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మూసధోరణిలో పోకుండా, సరికొత్త ఐడియాలతో ముందుకు రావాలని వారికి సూచించారు. ఆ ఆలోచనలు సామాన్యుడి అవసరాలు, ఆలోచనా ధోరణిని ప్రతిబింబించేలా ఉండాలని చెప్పారు. బడ్జెట్ పై ఆన్ లైన్లో ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రులకు స్పష్టం చేశారు. ప్రతిష్ఠాత్మక 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం కూడా ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఫలితంగానే రూపుదిద్దుకున్నదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. ఇక, బడ్జెట్ లో కేటాయించే నిధులను ఖర్చు చేయడంపై నిశిత పరిశీలన అవసరమని నొక్కి చెప్పిన మోదీ, ఏడాది పొడవునా సమానంగా నిధులను ఖర్చు చేయాలంటూ మంత్రులకు సూచించారు.

  • Loading...

More Telugu News