: కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు: అశోక్ గజపతిరాజుకు హరీశ్ విజ్ఞప్తి


సింగరేణి బొగ్గు గనులకు ప్రధాన కేంద్రం కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించిన సింగరేణి బొగ్గు గనులకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటైతే బొగ్గు క్రయ విక్రయాలకు మరింత సౌలభ్యం లభిస్తుందని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు సంబంధించి ప్రభుత్వ వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి అందించారు.

  • Loading...

More Telugu News