: ఆ చేప రూ.23 లక్షలు పలికింది!


సముద్రపు చేపల్లో అత్యంత రుచికరమైనదిగా టూనా చేపకు పేరుంది. దీని ఖరీదు కూడా ఎక్కువే. ఈ చేప మాంసం కిలో వేలల్లో పలుకుతుంది. తక్కువ సంఖ్యలో లభ్యం కావడం కూడా దీనికి అధిక డిమాండును తెచ్చిపెట్టింది. జపాన్ లో అయితే ఈ చేపలను వేలం వేస్తారు. టోక్యోలోని సుకిజి ఫిష్ మార్కెట్లో సోమవారం నాడు టూనా చేపలను వేలం వేయగా ఓ చేపకు రూ.23 లక్షల ధర లభించింది. 180 కిలోల బరువున్న ఆ టూనా చేపను సుషి గొలుసుకట్టు రెస్టారెంట్ల యజమాని కియోషి కిముర దక్కించుకున్నారు. వరుసగా నాలుగో ఏడాది ఆయన తొలి వేలంలో టూనా చేపను దక్కించుకోవడం విశేషం. కాగా, టూనా చేపల దేహంలో ఫ్లోటింగ్ బ్లాడర్ నిర్మాణం ఉండదు. దాంతో అవి నీటిలో తేలలేవు. నిరంతరం సముద్ర జలాల్లో ఈదుతూ ఉండాల్సిందే. ఈత ఆపితే నీటి అడుగుకు పడిపోతాయి.

  • Loading...

More Telugu News