: ఏపీ రాజధాని ప్రాంతంలో వేగంగా భూ సమీకరణ ప్రక్రియ
ఏపీ రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా తుళ్లూరు మండంలో భూ సమీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం అధికారులు ఇప్పటివరకూ 8 గ్రామాల్లోని 294 మంది రైతుల నుంచి 1,020 ఎకరాలకు అంగీకార పత్రాలు స్వీకరించారు. ప్రస్తుతం తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల్లో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఏప్రిల్ నుంచి కౌలు పరిహారం ఇస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. భూ సమీకరణ నేపథ్యంలో మార్చి వరకే పంటల సాగుకు అనుమతి ఉందని కలెక్టర్ చెప్పారు. భూ సమీకరణలో రైతులను బలవంతం చేయవద్దన్నారు.