: 'షేర్' ఢమాల్... గంటలో లక్షన్నర కోట్లు ఆవిరి!
అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ నేడు భారీగా నష్టపోయింది. సెషన్ ఆరంభమైన కాసేపటికే 500 పాయింట్లకు పైగా సెన్సెక్స్ దిగజారింది. దీని ఫలితంగా గంట వ్యవధిలో లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్టర్ల సంపద గాల్లో కలసిపోయింది. ఇటీవలే రూ.100 లక్షల కోట్లను అధిగమించిన బీఎస్ఈ నేటి సెషన్లో కిందకు దిగి వచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 564 పాయింట్ల నష్టంలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సూచీ 150 పాయింట్ల నష్టంలో సాగుతున్నాయి.