: తిరుపతిలో దారుణం... వడ్డీ వ్యాపారుల బెదిరింపులతో మహిళ ఆత్మహత్య
తిరుపతిలో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. వడ్డీ వ్యాపారుల ధనదాహంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు చేసిన అప్పులను తీర్చాలంటూ వడ్డీ వ్యాపారులు బెదిరించడంతో నగరానికి చెందిన సరస్వతమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. అప్పులు తీర్చకపోతే చంపేస్తామంటూ వడ్డీ వ్యాపారులు ఆమెను బెదిరించినట్లు సమాచారం. ఆమె ఆత్మహత్య నేపథ్యంలో, వడ్డీ వ్యాపారుల ఆగడాలపై స్థానికులు ఆందోళనకు దిగారు. సరస్వతమ్మను బెదిరింపులకు గురిచేసిన వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.