: 9 నెలలు... 19 శాతం ఆదాయం వృద్ధి: ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్


రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆదాయం శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖలో గణనీయ వృద్ధి నమోదు కాగా... తాజాగా రవాణా శాఖ ఆదాయం పెరుగుదల కూడా స్పీడందుకుంది. కేవలం 9 నెలల కాలంలోనే ఆ శాఖ ఆదాయం 19 శాతం పెరిగిందట. ఈ మేరకు ఆ శాఖ జాయింట్ కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు సోమవారం వెల్లడించారు. ఏపీ పరిధిలోని 13 జిల్లాల్లోనూ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, అదే సమయంలో ఆదాయంలో వృద్ధి శరవేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. సత్వర సేవలందించేందుకే ఆధార్ అనుసంధానాన్ని చేపడుతున్నామని, ఇందులో వాహనదారులు భయపడాల్సిందేమీ లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News