: ఎంపీని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి పరిస్థితి విషమం
ఎంపీని చెంపదెబ్బ కొట్టి సంచలనం రేపిన దేబశిష్ ఆచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తామ్లక్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లా చాందీపూర్ లో జరిగిన సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీని దేబశిష్ చెంపదెబ్బ కొట్టాడు. దీంతో కోపోద్రిక్తులైన తృణమూల్ కార్యకర్తలు విచక్షణారహితంగా అతడిని చావబాదారు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయని, మరో మూడు చోట్ల గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. కాగా, తనను చెంప దెబ్బ కొట్టిన దేబశిష్ ఆచార్యను క్షమిస్తున్నానని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అభిషేక్ బెనర్జీ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.