: తెలంగాణ వైసీపీ నేత తాటి వెంకటేశ్వర్లు రాజీనామా
తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడిపోతున్నారు. తాజాగా, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ తాటి వెంకటేశ్వర్లు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో తనకు తెలియకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారని, దాంతో తాను మనస్తాపం చెందానని తాటి తెలిపారు. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. పార్టీని ప్రాణంలా చూసుకున్న తనకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తాటి త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు సమాచారం.