: రైతు సమస్యలపై జగన్ దీక్ష: వైఎస్ఆర్సీపీ
ఏపీ రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపట్టబోతున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు వేదికగా దీక్ష జరగనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1న ఈ దీక్ష జరుగుతుందని వెల్లడించారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై పార్టీ నేతలతో కలసి వైఎస్ జగన్ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో ధర్మాన మాట్లాడుతూ, రైతుల సమస్యల అంశంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరామన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వలేమన్న వారిని కేసుల్లో ఇరికిస్తున్నారని, భూములను బలవంతంగా లాక్కుంటున్నారని గవర్నర్ కు చెప్పామన్నారు.