: మహిళ ఆత్మహత్యాయత్నం... పోలీసులకు గాయాలు
నెల్లూరు జిల్లాలోని కోవూరులో ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై అట్రాసిటీ కేసు నమోదవడంతో ఆమెను వారు అరెస్టు చేశారు. దీంతో, తనపై అక్రమంగా కేసు బనాయించారని ఆరోపిస్తూ, సదరు మహిళ కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన పోలీసులు, ఆమెను అడ్డుకుని కత్తిని లాక్కున్నారు. ఈ పెనుగులాటలో ఆమెను అడ్డుకున్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.