: తాలిబన్ల దాడుల భయంతో పోలియో ప్రచారాన్ని విరమించుకున్న పాకిస్థాన్


పాకిస్థాన్ లో పోలియో మహమ్మారిని పారదోలేందుకు వేయాల్సిన చుక్కల మందు చిన్నారుల చెంతకు చేరడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సంవత్సరం తొలి పోలియో ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు పాకిస్తాన్ నేడు ప్రకటించింది. తాలిబన్ల దాడుల భయమే అందుకు కారణమని తెలుస్తోంది. రావల్పిండి జిల్లాలో ఓ పోలియో నిర్మూలన పథకం వర్కర్ పై దాడి జరగటం, మిగతా వారు విధుల్లోకి వెళ్లేందుకు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 54 జిల్లాల్లో 85 లక్షల మంది చిన్నారులకు వాక్సిన్ వేయాల్సి ఉంది. కాగా, కార్యక్రమాన్ని రీషెడ్యూల్ చేసి పిల్లలకు ఈ నెల 19న చుక్కల మందు వేస్తామని ఓ అధికారి వివరించారు. ఈ ఉదయం పోలియో చుక్కలు వేసేందుకు వెళుతున్న బృందంపై రిమోట్ సహాయంతో బాంబు పేల్చగా, ఓ వర్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News