: ఛత్తీస్ గడ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి నిరాశ


కేంద్రంలో అధికారంలోకి వచ్చి వరుస విజయాలు దక్కించుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఛత్తీస్ గఢ్ లో చేదు ఫలితాలు వచ్చాయి. ఛత్తీస్ గడ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీకి నిరాశ తప్పలేదు. మొత్తం పది కార్పొరేషన్లలో కాంగ్రెస్ నాలుగు స్థానాలు గెలుచుకోగా, బీజేపీ కూడా నాలుగు స్థానాలు దక్కించుకుంది. మరో రెండింటిని స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు. ఈ ఫలితాల్లో బీజేపీ హవా ఎక్కడా కనిపించలేదని స్పష్టమవుతోంది. 2009లో బీజేపీకి ఆరు కార్పొరేషన్లు, కాంగ్రెస్ కు మూడు స్థానాలు వచ్చాయి. 2003 నుంచి ఈ రాష్ట్రంలో నిరాటంకంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రమణ్ సింగ్ కూడా ఈ ఫలితాలను అంచనా వేయలేదు. "అంచనాల మేరకు ఫలితాలు ఎందుకు రాలేదని సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు.

  • Loading...

More Telugu News