: ఇకపై అన్ని గ్యాస్ కేంద్రాల్లో 5 కేజీల సిలిండర్ల అమ్మకాలు: కేంద్రం


ప్రజలకు మరింత సులభంగా వంట గ్యాస్ లభించేలా 5 కేజీల సిలిండర్లను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్వహిస్తున్న అన్ని గ్యాస్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్టు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భువనేశ్వర్ లో అతిపెద్ద స్లమ్ ఏరియా సాలియా సాహిలో 5 కేజీల సిలిండర్ల అమ్మకాలను ఆయన ప్రారంభించారు. చిన్న సిలిండర్లపై కూడా సబ్సిడీ వర్తిస్తుందని ఆయన వివరించారు. కాగా, దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న నిరుపేద వోటర్లను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News