: తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు


హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. కేరళ రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్వర్యంలో ఏడు రోజులపాటు యాత్ర జరుగుతుందని ఆ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా మంత్రాలయం, శ్రీరంగపట్నం, గురువాయూర్, పంబ, శబరిమల, మధురై, పళని, తిరుపతిలను దర్శించుకోవచ్చని వివరించారు. ఏసీలో ప్రయాణానికి పెద్దలకు రూ 8,600, పిల్లలకు రూ.6,880, నాన్ ఏసీ అయితే పెద్దలకు రూ.6,800, పిల్లలకు రూ.5,400 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు www.telanganatourism.gov.in వెబ్‌ సైట్‌ ను సంప్రదించాలని కోరారు.

  • Loading...

More Telugu News