: ఆశారాం బాపూకు బెయిల్ నిరాకరణ
అత్యాచారం కేసులో శిక్షను అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అంతకుముందు తన ఆరోగ్యం బాగాలేదని, శస్త్రచికిత్స చేయించుకునేందుకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన కోరారు. ఆశరాంకు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని, ఆయన కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ మందులతోనే నయమవుతుందని వైద్యులు తమ మెడికల్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించారు. దీంతో ఆశారాంకు బెయిల్ అక్కర్లేదని భావించిన కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది.