: చంద్రబాబే కాదు ఆయన తండ్రి కూడా భూములను లాక్కోలేరు: జగన్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. రైతులకు ఇష్టం లేకపోయినా రాజధాని పేరుతో వారి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. భారీ రియలెస్టేట్ వ్యాపారానికి టీడీపీ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. ఈ రోజు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులతో జగన్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జగన్ నిప్పులు చెరిగారు. రైతుల అంగీకారం లేకుండా చంద్రబాబే కాదు, ఆయన తండ్రి కూడా భూములను లాక్కోలేరని ఈ సందర్భంగా జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే కోర్టుకు, మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళతామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎంతవరకైనా పోరాడతామని అన్నారు. రైతుల గురించి టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సాయంత్రం గవర్నర్ ను కలసి ప్రభుత్వ అరాచకాలపై వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News