: సరిహద్దుల్లో భారత్ సైన్యం కంటబడ్డ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్
పాకిస్తాన్ కేంద్రంగా లష్కర్-ఏ-తోయిబా పేరిట ఉగ్రవాద సంస్థను నడుపుతూ, భారత్ పై దాడులకు ప్రోత్సహిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను సరిహద్దులకు అవతలివైపున చూసినట్టు భద్రతాదళాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ పరిధిలోని సాంబా సెక్టార్ లో ఉన్న సైన్యానికి పాకిస్తాన్ సరిహద్దు అవుట్ పోస్ట్ ల వద్ద హఫీజ్ కనిపించినట్టు సోమవారం విడుదలైన నివేదిక స్పష్టం చేసింది. సరిహద్దుల వెంట హఫీజ్ కనిపించడం ఇదే తొలిసారేం కాదు. మన సైన్యానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న పాక్ శిబిరాల నుంచి 'హఫీజ్ సయీద్ జిందాబాద్' అంటూ అరుపులు వినిపించాయని, ఆపై హఫీజ్ ను సైన్యం చూసిందని తెలుస్తోంది. ఈ ఘటన శనివారం జరిగినట్టు సైన్యాధికారి ఒకరు తెలిపారు.