: నేడు కాశ్మీర్ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ... రాష్ట్రంలో అనిశ్చితి వీడేనా?


జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలూ వెలుడవడ్డాయి. ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. 28 స్థానాలతో పీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఇంకో పది మందికిపైగా ఎమ్మెల్యేలు కలిస్తే కాని ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. అయితే మద్దతిచ్చేందుకు బీజేపీ చేయి చాచినా, దానిని అందుకునేందుకు పీడీపీ సంశయిస్తోంది. 14 రోజులకు పైగా ఇదే పరిస్థితి. దీంతో ఈ అనిశ్చితిని తొలగించేందుకు బీజేపీ నడుం బిగించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు తమ పార్టీ రాష్ట్ర శాఖ నేతలతో సమావేశమవుతున్నారు. బీజేపీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జుగల్ కిశోర్, మాజీ అధ్యక్షులు నిర్మల్ సింగ్, అశోక్ ఖజూరియా, శంషేర్ సింగ్ మన్హస్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లతో పాటు పార్టీ నేతలు కవీందర్ గుప్తా, బాలి భగత్, రాజీవ్ జస్సోతియాలతో కూడిన కోర్ కమిటీతో అమిత్ షా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్నారు. పీడీపీతో జట్టు కట్టి సర్కారు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలతో పాటు పీడీపీ డిమాండ్లు, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇరు పార్టీలు ఉమ్మడి ప్రణాళిక తదతరాలపై ఈ సందర్భంగా చర్చ జరగనుంది. ఈ భేటీ తర్వాత కాశ్మీర్ లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News