: విరుచుకుపడ్డ బీహారీ దొంగలు... రైల్లో భారీ చోరీ
బీహార్లో దొంగలు మరోసారి విరుచుకుపడ్డారు. గత రాత్రి జామూయి సమీపంలో టాటానగర్ నుంచి చాప్రా వెళుతున్న టాటా-చాప్రా ఎక్స్ ప్రెస్ (18181) లోకి చొరబడ్డ దుండగులు 4 బోగీల్లో చోరీకి పాల్పడ్డారు. మొత్తం 15 మంది దొంగలు చోరీకి పాల్పడినట్టు సమాచారం. వీరు ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున నగలు, నగదు దోచుకున్నారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో బీహార్లో రైలు దోపిడీ జరగటం ఇది మూడోసారి.