: కాసేపట్లో ఆహుతి ప్రసాద్ అంతిమ యాత్ర... ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు


టాలీవుడ్ ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అంతిమ యాత్ర నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. కేన్సర్ కారణంగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మధ్యాహ్నం మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో తెలుగు చిత్రసీమ విచారంలో మునిగిపోయింది. నటుడిగానే కాక, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఆయన భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మరికొద్దిసేపట్లో ఫిల్మ్ నగర్ నుంచి ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆహుతి ప్రసాద్ అంతిమ యాత్రలో తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు పాల్గొంటారు.

  • Loading...

More Telugu News