: హరీష్ రావు నా సోదరుడు లాంటి వాడు: జయప్రద


టీఎస్ మంత్రి హరీష్ రావును కేవలం మర్యాద పూర్వకంగానే కలిశానని మాజీ ఎంపీ, సినీనటి జయప్రద తెలిపారు. హరీష్ తనకు సోదరుడు లాంటి వాడని అన్నారు. ప్రస్తుతం జయప్రద ఏ పార్టీలో కొనసాగడం లేదు. దీనిపై ఆమె స్పందిస్తూ, 'మొన్ననే ఎన్నికలయ్యాయి. ఏ పార్టీలో చేరాలన్న విషయంపై నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తా'నని చెప్పారు. హరీష్ రావుతో జయప్రద భేటీ కావడంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ వైపు ఆమె మొగ్గుచూపుతోందని కొందరు అభిప్రాయపడుతుండగా... ఆంధ్ర ప్రాంతానికి చెందిన జయప్రదను టీఆర్ఎస్ లో ఎలా చేర్చుకుంటారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం దొరకాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

  • Loading...

More Telugu News