: అగ్రిగోల్డ్ మోసం చేసింది... ఏపీ వ్యాప్తంగా కేసుల నమోదు!


మనీ సర్క్యులేషన్ స్కీం పేరిట అగ్రిగోల్డ్ సంస్థ కూడా మోసాలకు పాల్పడింది. ఈ మేరకు ఆ సంస్థపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అగ్రిగోల్డ్, తక్కువ కాలంలోనే అధిక వడ్డీలతో సొమ్మును రెట్టింపు చేసి ఇస్తామని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. అయితే మెచ్యూరిటీ తీరిన బాండ్లకు సంబంధించిన సొమ్మును చెల్లించడంలో ఆ సంస్థ విఫలమైంది. ఈ క్రమంలో సంస్థ డిపాజిటర్లు విజయవాడ సహా నెల్లూరు, ఏలూరు తదితర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల గడప తొక్కారు. దీంతో సంస్థ యజమానులు రామారావు, కుమార్ ల ఇళ్లలో ఏలూరు సీసీఎస్ పోలీసులు నిన్న రాత్రంతా తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్లతో రూ.28 లక్షల విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏలూరు సీసీఎస్ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు బాధితుల నుంచి ఫిర్యాదుల వెల్లువ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థపై కేసులు నమోదయ్యాయి. డిపాజిట్ల సేకరణలో అగ్రిగోల్డ్ నిర్వాహకులు ఆర్బీఐ నిబంధనలను అతిక్రమించారని కేసులు దాఖలయ్యాయి.

  • Loading...

More Telugu News