: పవన్ కల్యాణ్ గారు నాకు ఫోన్ చేశారు...ప్రతి మాటా గుర్తుంది: అనూప్ రూబెన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు ఈ సినిమా కోసం పని చేయాలని తొలిసారి ఫోన్ చేసినప్పుడు తాను నమ్మలేకపోయానని 'గోపాల గోపాల' సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన 'గోపాల గోపాల' ఆడియో వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిసారి పవన్ కల్యాణ్ గారు మాట్లాడిన ప్రతిమాట తనకు గుర్తుందని అన్నారు. అది జీవితంలో అనుసరిస్తానని అనూప్ రూబెన్స్ పేర్కొన్నారు. తనకు వెంకటేష్ గారు కూడా ఇష్టమని ఆయన వెల్లడించారు. సినిమాకు మంచి స్వరాలు అందించానని, సినిమాను తప్పకుండా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.