: నాకిష్టమైన హీరో వెంకటేష్...ఇష్టమైన స్నేహితుడు పవన్ కల్యాణ్: త్రివిక్రమ్
తనకు ఇష్టమైన హీరో వెంకటేష్ అని, తనకు ఇష్టమైన స్నేహితుడు పవన్ కల్యాణ్ అని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన 'గోపాల గోపాల' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తన వెండితెర ప్రారంభం 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా ద్వారా ఆరంభమైందని అన్నారు. తన హీరో వెంకటేష్, స్నేహితుడు పవన్ కల్యాణ్ కలసి నటించిన 'గోపాల గోపాల' సినిమా చాలా బాగుంటుందని ఆయన తెలిపారు. ఈసారి తెలుగు సినీ అభిమానులకు సంక్రాంతి జనవరి 9నే వస్తుందని, సినిమా అందర్నీ అలరిస్తుందని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ పాటను విడుదల చేశారు.