: సినిమాల్లోకి రాకముందు వెంకీ అభిమానిని, సినిమాల్లోకి వచ్చాక పవన్ అభిమానిని: దిల్ రాజు


సినిమాల్లోకి రాకముందు తాను విక్టరీ వెంకటేష్ అభిమానినని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరుగుతున్న 'గోపాల గోపాల' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, వెంకటేష్ నటించిన 'కలియుగ పాండవులు' సినిమాను సుదర్శన్ థియేటర్లో ఫస్ట్ డే, ఫస్ట్ షో చూశానని తెలిపారు. 'తొలిప్రేమ' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడంతో కెరీర్ ఆరంభించానని, అప్పటి నుంచి తాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానినైపోయానని తెలిపారు. 'గోపాల గోపాల' ఆడియోలోని తొలి పాటను తాను విన్నానని, అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందించాడని అభినందించారు. సినీ దర్శకుడు డాలీ మంచి అభిరుచి ఉన్న దర్శకుడని, ఆయన దర్శకుడనగానే సినిమా సగం హిట్టైందని ఆయన అభిప్రాయపడ్డారు. హిట్ సినిమాలకు చిరునామా అయిన విక్టరీ వెంకటేష్, పవన్ కల్యాణ్ కలసి నటిస్తే అది హిట్ కాకుండా ఉండే అవకాశం ఉందా? అని ఆయన అభిమానులను ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News