: 'గోపాల గోపాల' ఆడియో వేడుక వద్ద దారుణం...అభిమాని గొంతుకోసిన ఆగంతుకులు


'గోపాల గోపాల' ఆడియో వేడుక వద్ద దారుణం చోటుచేసుకుంది. 'గోపాల గోపాల' ఆడియో వేడుక జరిగే శిల్పకళావేడుక గేటు నెంబర్ 1 దగ్గర గుర్తు తెలియని ఆగంతుకులు పవన్ కల్యాణ్ అభిమాని గొంతుకోసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితుడు గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే అభిమానిగా గుర్తించారు.

  • Loading...

More Telugu News