: కేసీఆర్ మాయ మాటలు నమ్మొద్దు: రేవంత్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. హైదరాబాదులోని కంటోన్మెంట్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మాయ మాటలు నమ్మొద్దని సూచించారు. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కంటోన్మెంట్ లో అడుగుపెట్టాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలని అన్నారు. కేసీఆర్ దేశంలోని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరని ఆయన చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తారని ఆయన విమర్శించారు. కేసీఆర్ మాటలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News