: శబరిమలకు వెళ్లిన నలుగురు మహిళల ఆచూకీ గల్లంతు


శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లిన నలుగురు మహిళల ఆచూకీ గల్లంతైంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్నగోనహళ్ కు చెందిన ముగ్గురు మహిళలు, ఎమ్మిగనూరు మండలం లక్ష్మీపేటకు చెందిన ఓ మహిళ ఎనిమిది రోజుల క్రితం కేరళలోని శబరిమలకు వెళ్లారు. అక్కడి నుంచి బంధువులను సంప్రదించిన వీరు, ఆ తరువాత ఆచూకీ లేకుండా పోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, రైల్వే పోలీసులను సంప్రదించారు. వీరితో పాటు శబరిమల వెళ్లిన వ్యక్తులను విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News