: 42 మంది ఐఏఎస్ అధికారులకు రిలీవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న 42 మంది అఖిల భారత సర్వీసుల అధికారులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 42 మంది అధికారులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వీరిని ఏపీ విధుల నుంచి రిలీవ్ చేసింది. కాగా, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను ఏపీలోనే కొనసాగాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో, ఆ ఐదుగురు ఐఏఎస్ అధికారులు ఏపీలోనే విధులు నిర్వర్తించనున్నారు.