: మంచోళ్లని దేవుడు పిలుచుకుంటాడు: జూనియర్ ఎన్టీఆర్, నరేష్, శ్రీకాంత్


మంచి వాళ్లను దేవుడు తన దగ్గరకు తొందరగా పిలుచుకుంటాడని, అందుకే ఆహుతి ప్రసాద్ ను దేవుడు తీసుకెళ్లిపోయాడని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. హైదరాబాదులో దివంగత సినీ నటుడు ఆహుతి ప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ, ఆయన చాలా మంచి వ్యక్తని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షించారు. ఈ సందర్భంగా మరో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ, ఆహుతి ప్రసాద్ లాంటి మంచి వ్యక్తిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోవడం దురదృష్టమని అన్నారు. ఆయన సేవలను సినీ పరిశ్రమ, ఆయన పాత్రలను అభిమానులు మర్చిపోలేరని పేర్కొన్నారు. ఇంకో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆహుతి ప్రసాద్, తాను ఒకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నామని తెలిపారు. తనకు సీనియర్ గా ధైర్యాన్నిచ్చేవారని ఆహుతి ప్రసాద్ ను గుర్తు చేసుకున్నారు. ఆయన చాలా మంచి నటుడని పేర్కొన్నారు. సినీనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు శివాజీ రాజా మాట్లాడుతూ, తామిద్దరం ఒకేసారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నామని అన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని ఆయన పేర్కొన్నారు. ఆహుతి ప్రసాద్ చాలా మంచి వ్యక్తని, ఆయనతో తనకు చాలా మంచి అనుభవాలు ఉన్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News