: ధోనీ రిటైర్మెంట్ మాకు లాభమే... కోహ్లీ సమర్థుడే!: ఆసీస్ ఆటగాడు వార్నర్


ధోనీ టెస్టుల నుంచి తప్పుకోవడం ఆస్ట్రేలియాకు లాభిస్తుందని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. సిడ్నీలో వార్నర్ మాట్లాడుతూ, జట్టు గురించి ఎన్నో ప్రణాళికలు రచించే ధోనీ చివరి టెస్టుకు ముందే టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పడం తమకు లాభిస్తుందని అన్నాడు. ధోనీ ప్రణాళికలు ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలని అభిప్రాయపడ్డాడు. అలాంటి ప్రణాళికలతోనే ధోనీ చాలా విజయాలు సాధించాడని వార్నర్ గుర్తు చేశాడు. కాగా, టీమిండియా కొత్త కెప్టెన్ గా కోహ్లీ సమర్ధుడేనని వార్నర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి చాలా భవిష్యత్ ఉన్నందున, కెప్టెన్సీ కూడా బాగా నిర్వర్తించే అవకాశం ఉందని వార్నర్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News