: భీమవరం సోమేశ్వరస్వామి ఆలయ పుష్కరిణి కలుషితం...పెద్ద సంఖ్యలో చేపలు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయ పుష్కరిణి కలుషితమైంది. పుష్కరిణిలో పెద్ద సంఖ్యలో చేపలు మృత్యువాతపడ్డాయి. దీంతో ఆలయ పరిసరాలను దుర్వాసన చుట్టుముట్టింది. పర్వదినాల్లో స్వామివారు పుష్కరిణిలో విహరిస్తారు. అంతేకాక నిత్యం స్వామి వారి పూజాదికాల్లో పుష్కరిణి నీటినే వాడుతున్నారు. పవిత్రంగా కాపాడాల్సిన పుష్కరిణిని పాలక మండలి చేపల పెంపకానికి లీజుకివ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో చేపల పెంపకందారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.