: కర్నూలులో జపాన్ సోలార్ విద్యుత్ కేంద్రాలు: నేడు జిల్లాలో జపాన్ బృందం పర్యటన
జపాన్ ప్రతినిధుల బృందం నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనుంది. జిల్లాలోని పాణ్యం, గడివేముల మండలాల్లో పర్యటించనున్న ప్రతినిధి బృందం అక్కడ సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనుకూలమైన ప్రదేశాన్ని గుర్తించనుంది. సీఎం చంద్రబాబునాయుడు జపాన్ లో పర్యటించిన సందర్భంగా సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఆ దేశ పారశ్రామికవేత్తలు ఆసక్తి కనబరచారు. తాజాగా భారత్ వచ్చిన జపాన్ ప్రతినిధులు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. స్థలాన్ని గుర్తించిన వెంటనే విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నాయి.