: అనంతలో లేడీ డ్రింకర్ల దాడి... యువకుడికి తీవ్ర గాయాలు


మద్యం మత్తులో పురుషులేనా విరుచుకుపడేది? మేమేం తక్కువ తిన్నామా? అనుకున్నారేమో, మహిళలు కూడా ఈ తరహా దాడులకు పాల్పడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అయితే, నిన్నటిదాకా ఈ తరహా జాడ్యం హైదరాబాదుకే పరిమితమైనా, తాజాగా జిల్లాలకూ పాకుతోంది. నిన్న రాత్రి అనంతపురంలో మందేసిన ముగ్గురు మహిళలు హల్ చల్ చేశారు. మత్తులో కూరుకుపోయిన ఆ మహిళలు ఓ యువకుడిపై దాడికి దిగారు. ఏకంగా బీరుసీసాతో యువకుడి తలపై మోదారు. దీంతో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరగా, లేడీ డ్రింకర్లు మాత్రం మెల్లగా తప్పించుకున్నారు.

  • Loading...

More Telugu News