: మద్యం మత్తులో యువతి వీరంగం... ర్యాష్ డ్రైవింగ్ తో నలుగురిని గాయపరచిన వైనం


హైదరాబాదులో మరో యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. తాగిన మైకంలో కారును ర్యాష్ గా డ్రైవ్ చేసిన ఆ యువతి మూడు కార్లు, ఓ బైక్ ను ఢీకొట్టింది. ఓల్డ్ ఆల్వాల్ లో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. అప్పటిదాకా మత్తులో ఉన్న యువతి, తన కారును నిలిపేందుకు స్థానికులు యత్నించడంతో తేరుకుని తప్పించుకునే యత్నం చేసింది. అయితే చాకచక్యంగా వ్యవహరించిన స్థానికులు యువతిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News