: బాలగోపాల్ మృతదేహాన్ని త్వరలో స్వస్థలం చేరుస్తాం: తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని
అమెరికాలో దారుణ హత్యకు గురైన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం చిట్టూర్పుకు చెందిన పరుచూరి బాలగోపాల్ మృతదేహాన్ని త్వరలో స్వస్థలం చేరుస్తామని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఆయన చెప్పారు. గ్యాస్ స్టేషన్ యజమాని శ్రీధర్ కమ్మ సహకారంతో త్వరలోనే అతడి మృతదేహాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేయనున్నామని తెలిపారు. సౌత్ కరోలినాలోని మైథేల్ బీచ్ గ్యాస్ స్టేషన్ లో దొంగతనానికి వచ్చిన కొంతమంది నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో బాలగోపాల్ మరణించిన సంగతి తెలిసిందే.