: ఇక శబరిమలలో తెలంగాణ భక్తులకు సర్కారీ వసతి!


శబరిమల వెళ్లే భక్తులు ఇకపై వసతికి సంబంధించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఎంతమాత్రం రాదు. ప్రైవేట్ వసతి గృహాలపై ఆధారపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే, అక్కడ ఐదెకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రభుత్వ అతిథి గృహం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నిన్న కేరళలో పర్యటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. తెలంగాణ భక్తుల సౌకర్యార్థం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలన్న కేసీఆర్ విజ్ఞప్తికి కేరళ సీఎం ఉమెన్ చాందీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ కోరినట్లుగా త్వరలోనే ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే, గతవారంలో ఉమెన్ చాందీని కలిసిన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. అవసరమైతే ప్రభుత్వం నుంచి లేఖ కూడా ఇప్పిస్తామని నాడు వీహెచ్ చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News