: నిర్మాణ రంగంలో సర్టిఫికెట్ కోర్సు: టీ ఉన్నత విద్యా మండలి నిర్ణయం
నిర్మాణ రంగంలో తెలంగాణ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నిర్మాణ రంగంలో సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించేందుకు నిర్ణయించింది. స్వల్పకాలంలో పూర్తయ్యే ఈ కోర్సు ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా పాఠ్యప్రణాళికను రూపొందించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శనివారం విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, అధికారులతో మండలి సుదీర్ఘంగా భేటీ నిర్వహించింది. నిరుద్యోగంతో సతమతమవుతున్న యువతకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ఈ భేటీ దృష్టి సారించింది.