: ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం: క్లార్క్
టెస్ట్ క్రికెట్ నుంచి ధోనీ వైదొలగడం తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ అన్నాడు. కెప్టెన్ గా ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని చెప్పాడు. అంతర్జాతీయ ఆటల్లో ఉండే అన్ని ఉద్యోగాల కంటే... టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడం చాలా కష్టమని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉంటూనే, కీపర్ గా కూడా ధోనీ అద్భుతంగా రాణించాడని కితాబిచ్చాడు. ధోనీతో తనకున్న సంబంధాలు బాగున్నాయని... మోటార్ బైక్స్ గురించి ధోనీని అడిగి తెలుసుకునేవాడినని అన్నాడు.