: పాక్ తీరును సహించం... గట్టిగా బదులిస్తాం: అమిత్ షా
కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ, కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. భారత భూభాగాలపై పాక్ సైన్యం కాల్పులకు దిగితే గట్టిగా బదులిస్తామని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ తీరు ఆక్షేపణీయమని... ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఈ రోజు బెంగళూరులో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భేటీలో ప్రసంగిస్తూ ఆయన పైవిధంగా స్పందించారు.