: ఈ నెల 5న తెలంగాణ ఎంసెట్ తేదీ ప్రకటన


ఓ వైపు ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్ర విద్యాశాఖల మధ్య మాటల సమరం నడుస్తోంది. ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా ఈ పంచాయతీ తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ఉన్నత విద్యా మండలి రెండు గంటల పాటు సమావేశమయింది. కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. అనంతరం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 5న (ఎల్లుండి) ఎంసెట్ తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో సాయంత్రం గవర్నర్ భేటీ అవుతుండటం వల్ల... ఇప్పటికిప్పుడు ఎంసెట్ తేదీలపై ప్రకటన చేయడం లేదని వివరించారు.

  • Loading...

More Telugu News