: సివిల్ సర్వీస్ అధికారుల బదిలీకి ఏపీ ఆమోదం


అఖిల భారత సర్వీసుల (సివిల్ సర్వీసెస్) అధికారుల విభజన పూర్తయిన నేపథ్యంలో, తెలంగాణకు వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల బదిలీకి సంబంధించిన ఫైలుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఇదే సమయంలో, తెలంగాణ ప్రభుత్వ వైఖరి మాత్రం కొంత గందరగోళంగా ఉంది. ఏపీకి కేటాయించిన ఐదుగురు అధికారులను రిలీవ్ చేయమని... తమ వద్దే అట్టిపెట్టుకుంటామని టీఎస్ ప్రభుత్వం చెబుతోంది.

  • Loading...

More Telugu News